PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్వాడీ కేంద్రాల పనితీరు భేష్

1 min read

– అంగన్వాడి కేంద్రాలకు మౌలిక వసతులు కల్పిస్తాం

– ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్

పల్లెవెలుగు వెబ్​ చెన్నూరు:  అంగన్వాడి  కేంద్రాలలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలా పనితీరు  చాలా బాగుందని అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లలను ఆయాలు వారి ఇంటి వద్దకే వెళ్లి పిల్లలను తీసుకురావడం వారి ఆలనా పాలనతో పాటు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన బుధవారం స్థానిక ఒకటవ వార్డులోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు, అక్కడ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, అలాగే చిన్నారుల పట్ల వారు తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు, అదేవిధంగా వారు అంగన్వాడీలలో ఉన్న పిల్లలకు ఏ ఏ పౌష్టికాహారాలు అందిస్తున్నారో, అక్కడ అంగన్వాడి టీచర్లను ఆయాలను అడిగి తెలుసుకున్నారు, వారు పిల్లలకు అందిస్తున్నటువంటి పౌష్టికాహారాన్ని గురించి, అంగన్వాడీలలో ఉన్న సమస్యల గురించి ఎంపీపీకి తెలియజేయడం జరిగింది, ఆయన స్పందిస్తూ అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న సమస్యలను కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి తెలియజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

About Author