NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ కిక్​ ’ కొట్టారు.. పతకం పట్టారు..

1 min read

 ‘ ఖేలో ఇండియా’ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలికలు

  •  వివిధ పోటీలో 200 మంది క్రీడాకారులు బరిలోకి..
  • కర్నూలు ప్రతిష్టను పెంచిన త్రినాథ్​  కిక్​ బాక్సింగ్​ అకాడమీ
  • విజేతలకు బహుమతులు అందజేసిన డా. త్రినాథ్​

 కర్నూలు స్పోర్ట్స్​ , న్యూస్​ నేడు:  ఖేలో ఇండియా కిక్​ బాక్సింగ్​ పోటీలో క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభ కనబరచారు.  రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన  200 మంది క్రీడాకారిణులు బరిలో దిగారు.  కర్నూలు నగరం డాక్టర్స్​ కాలనీలోని త్రినాథ్​  కిక్​ బాక్సింగ్​ అకాడమీ లో  శుక్రవారం జరిగిన వివిధ పోటీలలో బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కార్యక్రమానికి త్రినాథ్​ అకాడమీ చైర్మన్​, అమ్మ హాస్పిటల్​ అధినేత డా. త్రినాథ్​ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.  పోటీల అనంతరం డా. త్రినాథ్​ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఖేలో ఇండియాలో భాగమైన కిక్​ బాక్సింగ్​ పోటీలో బాలికలు విశేష ప్రతిభ కనబరిచారన్నారు.  ఇక్కడ గెలుపొందిన విజేతలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చూపి పతకాలు సాధించాలని ఈ సందర్భంగా డా. త్రినాథ్​ ఆకాంక్షించారు.   కర్నూలులోని త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీలో ఖేలో ఇండియా పోటీలు జరగడం సంతోషంగా ఉందని, ఇది కర్నూలు ప్రతిష్టను పెంచిందన్నారు.  కార్యక్రమంలో  కేవి సుబ్బారెడ్డి,  రాష్ట్ర కిక్ బాక్సింగ్  కార్యదర్శి నరేంద్ర ఆచారి , ప్రిన్సిపల్స్ రామచంద్రుడు, రాఘవేంద్ర సార్, వెంకటేశ్వర్లు సార్, కోచస్ హరి అశోక్, రిఫరెన్స్ మహేష్, కళ్యాణ్,హరిబాబు, జయ కళ్యాణ్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు  పాల్గొన్నారు.

About Author