అంగన్వాడీ సమస్యలు పట్టని జగన్
1 min readముఖ్యమంత్రికి పోస్టు ద్వారా కార్డులను పంపిన అంగన్వాడీలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గత 18 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు నిరసన సమ్మె చేస్తూ ఉన్నా అంగన్వాడీల సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదని నందికొట్కూరు టిడిపి నియోజకవర్గ అబ్జర్వర్ దేవర్ల మురళి అన్నారు.గురువారం మధ్యాహ్నం మిడుతూరు మండల కేంద్రంలో నిరసన దీక్షలు చేస్తున్న అంగన్వాడీలకు టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలకు మద్దతు తెలిపారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు.అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి పోస్ట్ ద్వారా కార్డులను ముఖ్యమంత్రికి పంపారు.ఈ సందర్భంగా కాత రమేష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్షతో కార్యకర్తలను వేధించడం ప్రభుత్వానికి తగదని గత నాలుగున్నర పాలనలో అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పోలీసు లాఠీలతో చితకబాదించిన ఘటనలను ఎవరూ మర్చిపోలేరన్నారు.గ్రామాల్లో బాలింతలు,గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తూ కీలక పాత్ర పోషిస్తున్నా వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.తర్వాత ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్ బాబు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘురాంమూర్తి,మాజీ సర్పంచులు వెంకటేశ్వర రెడ్డి, నాగేంద్ర,నాయకులు మొల్ల చాకర్ వలీ,యరభం ప్రమోద్ రెడ్డి,వ్యకాస ఓబులేష్,లింగస్వామి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.