ఎగ్జిబిషన్ కు రామాయణంలోని సంజీవిని మొక్క !
1 min readపల్లెవెలుగువెబ్ : రామాయణంలో ప్రముఖంగా ప్రస్తావించిన సంజీవిని మొక్కను ఈ నెల 22న చెన్నైలో జరిగే బయోడైవర్సిటీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాలని బిహార్ సర్కారు నిర్ణయించింది. బిహార్‌లోని రోహతస్ జిల్లాలో లభించే సంజీవిని బూతి అనే మొక్కను రామాయణంలోని సంజీవినిగా విశ్వసిస్తారు. సెలగెనెల్లా బ్రయోప్టెరిస్ అనే శాస్త్రీయ నామం కలిగిన సంజీవిని బూతిలో అనేక ఔషధ లక్షణాలున్నాయని బిహార్ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ డీకే శుక్లా వెల్లడించారు. రామాయణం ప్రకారం మేఘనాథుని బాణానికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్మణుడిని బతికించేందుకు సంజీవిని కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్తాడు. ఆ మొక్కను గుర్తించలేక ఆంజనేయుడు మొత్తం పర్వతాన్నే మోసుకొస్తాడు. సంజీవిని మహిమ వల్ల లక్ష్మణుడు బతుకుతాడు.