ప్లాస్టిక్ నిర్మూలన అత్యంత అవసరం…
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలన అనే అంశం మీద నేడు హొళగుంద మండలం, హెబ్బటం గ్రామంలోని సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు బూత్ ఇంచార్జ్, సచివాలయం సిబ్బంది, మరియు స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి పాల్గొనటం జరిగింది. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి సుందరమైన గ్రామం గా పరిశుభ్రత సాధనకు మరియు ప్లాస్టిక్ నిర్మూలన అత్యంత అవసరం, స్వచ్ఛతకు అత్యంత పెద్దపీట వేయటం అందులో ప్రజల్ని సైతం భాగస్వాముల్ని చేయటం గొప్ప విషయం అని తెలపడం జరిగింది.ఈ కార్యక్రమం లో టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి. సవారప్ప, నాయకులు నరసప్ప, నాగయ్య,మల్లికార్జున, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.