డి ఏ పాత బకాయిలు విడుదల చేయండి..
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి డి ఎ పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. దాదాపు సంవత్సర కాలం నుండి ఉద్యోగులకు రావాల్సిన డిఏ పాత బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పాత బకాయిలు విడుదల చేస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూశారు. కానీ వారి ఆశ నెరవేరలేదు. ఉగాది పండుగకు అయినా విడుదల చేస్తారనుకున్నారు. వారి కోరిక తీరలేదు. కనీసం ఈనెల చివర లేదా మే నెలలో పాత బకాయిలు విడుదల అయితే పిల్లల చదువుల ఖర్చులకు అయినా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం లాంటి ఇతర ఆలయాల్లో డి ఏ సంబంధించిన నిధులు గతంలోనే విడుదల చేసినట్లు సమాచారం. మహానంది ఆలయంలో పనిచేసే ఉద్యోగుల పాత బకాయిలు కూడా ఇతర ఆలయాల్లో మాదిరిగానే విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ ఏడాది మహానంది దేవస్థానానికి దాదాపు రెండు కోట్ల రూపాయలు గత ఏడాది కంటే అధికంగా ఆదాయం వచ్చిన, పాత బకాయిలు విడుదల చేయకపోవడంలో అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దేవాదాయ శాఖ కు గత మార్చి లోపు జమ ఖర్చులు ఫోను బడ్జెట్ మిగిలిపోయింది అని నివేదిక సమర్పించినట్లు సమాచారం. మిగులు బడ్జెట్లో పాత బకాయిలు చెల్లించి ఉంటే ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపేదని పలువురు భావిస్తున్నారు. పాత బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.