NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెడ్డీ గ్యాంగ్ ను ప‌ట్టుకున్న పోలీసులు

1 min read
                               

ప‌ల్లెవెలుగువెబ్ : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప‌లు దొంగ‌తనాల‌కు పాల్ప‌డ‌ని చెడ్డీ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకున్నారు. విజ‌య‌వాడ క‌మీష‌న‌రేట్ నుంచి గుజ‌రాత్ వెళ్లిన పోలీసు బృందాలు.. నిందితుల్ని ప‌ట్టుకుని న‌గ‌రానికి తీసుకొచ్చారు. గుజ‌రాత్ లోని దాహోద్ జిల్లా గుల్చ‌ర్ గ్రామానికి చెందిన మ‌డియా కాంజీ మేడీ, స‌క్ర‌మండోడ్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన క‌మ‌లేష్ బాబేరియాను అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం ఓ బృందం అన్వేషిస్తోంద‌ని పోలీసులు తెలిపారు. గుజ‌రాత్ లోని గుల్చ‌ర్ గ్రామం, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని జువాబుకు సంబంధించిన ప‌ది మంది ఓ పెళ్లి విందులో క‌లిసి మద్యం తాగార‌ని, ద‌క్షిణాదిలో దొంగ‌త‌నాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు పోలీసు విచార‌ణ‌లో తేలింది.

                                

About Author