PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ భీమ్లా నాయ‌క్ ’ పై పోలీస్ అధికారి అభ్యంత‌రం !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం భీమ్లా నాయ‌క్. ఇటీవ‌ల ఈ చిత్రం టైటిల్ సాంగ్ విడుద‌ల‌యింది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌బ్ ఇన్స్పెక్టర్ పాత్రలో న‌టిస్తున్నట్టు చిత్రానికి సంబంధించిన విజువ‌ల్స్ చూస్తే అర్థమ‌వుతుంది. అయితే.. ఈ సినిమా టైటిల్ సాంగ్ లో పోలీసుల తీరు గురించి వివ‌రిస్తూ రాసి.. పాడిన తీరు బాగాలేద‌ని ఓ పోలీస్ అధికారి అభ్యంత‌రం వ్యక్తం చేశారు. ఈ పాట‌లో వాడిన లిరిక్స్ గురించి హైద‌రాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ర‌మేష్ అభ్యంత‌రం తెలిపారు. ‘ మేం ఫ్రెండ్లీ పోలీసులం. ప్రజ‌ల‌కు ర‌క్షణ క‌ల్పించేందుకు జీతాలు తీసుకునే మేం వారి ఎముక‌ల్ని విర‌గ్గొట్టం. పోలీసుల గొప్పత‌నాన్ని చెప్పేందుకు ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రికి ఇంత‌క‌న్నా గొప్ప ప‌దాలు తెలుగులో దొర‌క‌లేదేమో !. ఈ పాట‌లో పోలీసుల సేవ‌ల గురించి తెలుప‌లేదు ’ అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అయితే దీనిని కొంద‌రు స‌మ‌ర్థిస్తుంటే.. మ‌రి కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.
హీరో పవన్​ కళ్యాణ్ భీమ్లానాయక్​

About Author