NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శాంతి భద్రతలు పరిరక్షణలోనే కాకుండా ప్రజాసేవలోనూ పోలీసులు ముందుండాలి

1 min read

రెవిన్యూ, పోలీసు శాఖలకు సమాజంలో గౌరవం ఉందని, నిలుపుకుంటూ ప్రజలకు సంతృప్తి సేవలందించాలి

గురువులు మంచి పౌరులను తీర్చిదిద్దితే, మంచి సమాజాలుగా తీర్చిదిద్దే అవకాశం పోలీసు శాఖ ఉంది

కర్నూలు, న్యూస్​ నేడు:  పిటిసి (SCTPC) లు పాసింగు ఔట్ పరేడ్ ​శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసాధి గౌరవ వందనాన్ని స్వీకరణ మంత్రి తో పాటు ఏలూరు రేంజీ ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెవ్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు :స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండులో శనివారం  పెదవేగి పోలీసు ట్రైనింగు సెంటరు (పి టి సి) ఆధ్వర్యంలో 136 మంది శిక్షణ పూర్తిచేసుకున్న స్టైఫండ్రీ క్యాడెటు ట్రైనీ పోలీసు కానిస్టేబుళ్ల (SCTPC) పాసింగు ఔట్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విశిష్ట అతిథిగా హాజరు అయ్యి, శిక్షణ పూర్తిచేసుకున్న పోలీసులు నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రితో పాటు ఏలూరు రేంజీ ఐజి జి.వి.జి.అశోక్ కుమార్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు.శిక్షణ ఇచ్చిన బృందానికి, శిక్షణకాలంలో విధినిర్వహణ, క్రమశిక్షణ, క్రీడలు, ఇండోర్- అవుట్‌డోర్ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ క్యాడెట్లకు మెమొంటో పురస్కారాలను, శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను  మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి పోలీసుశాఖను ఎన్నుకున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సమాజంలో ఏటువంటి జులాయి, పోకిరి అయినను పోలీసు యూనిపామ్ చూస్తే 95 శాతం తప్పక మార్పువస్తుందని అన్నారు. పోలీసు శాఖ ఎంతో బాధ్యత, ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ప్రజలు రక్షణ, శాంతిభద్రతలు పరిరక్షణకు అంకిత భావంతో పనిచెయ్యాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధుల్లో సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైనసేవలు అందించి, అందరి మన్ననలు పొందాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వై.ప్రసాదరావు, ఏఆర్ ఏఎస్పీ జి.పులిరాజు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, డిఎస్పి డి.శ్రావణ్ కుమార్, పెదవేగి పోలీసు అధికారులు, పోలీసు ట్రైనింగు శిక్షకులు, పోలీసు అధికారులు, శిక్షణ పూర్తిచేసుకున్న కానిస్టేబుళ్ళు మరియు వారి కుటుంబ, బంధువర్గ సభ్యులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

About Author