సినిమా షూటింగ్‌ను వదలని రాజకీయ నాయకులు
1 min readహైదరాబాద్ ; ఎన్నికలంటే చాలు రాజకీయ నాయకుల ప్రచారానికి.. అడ్డూ.. ఉండదు. ఎక్కడపడితే అక్కడ.. ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో మొదలుపెడతారు. ఇలాంటి ఘటనే రామాంతపూర్ లో జరిగింది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఓ సినిమా షూటింగ్ కు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో సదరు నిర్మాతలు సుభాష్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే.. సినిమా షూటింగ్ కు వచ్చిన సుభాష్ రెడ్డి.. పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ , హీరో సుధీర్ బాబును , దర్శక నిర్మాతలను తమ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి ఓటు వేయాల్సిందిగా కోరారు. దీంతో అక్కడున్న వాళ్లంత రాజకీయనాయకుడి బుద్ది పోనిచ్చుకోలేదు కదా అంటూ నవ్వుకున్నారు.