అశ్లీల చిత్రాలు.. లక్షల్లో డబ్బు వసూలు !
1 min readపల్లెవెలుగు వెబ్ : అశ్లీల చిత్రాల కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వ్యవహారంలో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. బ్రిటన్ లోని కెన్రిన్ అనే నిర్మాణ సంస్థతో కలిసి రాజ్ కుంద్రా ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. బ్రిటన్ కు చెందిన కెన్రిన్ సంస్థ.. రాజ్ కుంద్రా బంధువు ప్రదీప్ బక్షిది. కెన్రిన్ సంస్థ ఆధ్వర్యంలో హాట్ షాట్స్ అనే యాప్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతల్ని టార్గెట్ చేసుకుని.. వారిని అశ్లీల చిత్రాల్లో నటించేలా బలవంతం చేస్తున్నారని, వాటిని చిత్రించి ఓ యాప్ ద్వార కెన్రిన్ సంస్థకు పంపుతున్నారని విచారణలో వెల్లడైంది. ఈ చిత్రాలు చూడటానికి సబ్ స్క్రైబర్స్ నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారని తేలింది. తద్వార రాజ్ కుంద్రా లక్షల్లో సంపాదిస్తున్నారని పోలీసులు తెలిపారు. భారత చట్టాలను తప్పించుకునేందుకు రాజ్ కుంద్రా బ్రిటన్ నుంచి ఈ చిత్రాలను అప్ లోడ్ చేస్తున్నారని తేలింది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయినట్టు తేలింది. రాజ్ కుంద్రా వాట్సాప్, మెయిళ్లను చెక్ చేయడం ద్వార కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.