‘పవర్ స్టార్’ పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన పునీత్ రాజ్ కుమార్ ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా పునీత్ ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస వదిలారు. పునీత్ మరణంతో కన్నడ చిత్రపరిశ్రమలో విషాధ చాయలు అలుముకున్నాయి. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కర్ణాటక వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ రాజ్ కుమార్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మూడో కుమారుడు. ఇటీవల పునీత్ రాజ్ కుమార్ నటించిన యువరత్న చిత్రం తెలుగులో విడుదల అయింది.