KAT పరీక్షల్లో శ్రీచైతన్య విద్యార్థుల ప్రభంజనం
1 min readపల్లెవెలుగు వెబ్: నగరంలోని సంకల్బాగ్ లోని శ్రీచైతన్య పాఠశాల (IPL Branch) విద్యార్థులు జాతీయ స్థాయిలో KAT(Knowledge Assessment Test)వారు నిర్వహించిన లెవెల్ 2 పరీక్షలో అత్యంత ప్రతిభ చాటి రికార్డు స్థాయిలో ఎంపిక కావడం గర్హించదగ్గ విషయమని పాఠశాల ప్రిన్సిపాల్ సుప్రియ తెలిపారు .బుధవారం ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజి ఏం సురేష్ ముఖ్య అథితిగా హాజరైనారు .ఈ సందర్బంగా ఏ జి ఏం సురేష్ మాట్లాడుతూ తమ విద్యార్థులు రాష్ట్ర ,జాతీయ ,అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలో రాణిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేసారు .ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహం కింద రూ .6000=00 , 115 మంది విద్యార్థులకు KATసంస్థ వారు బంగారు పతకాలు ,ప్రశంసా పాత్రలు పంపారని తెలిపారు .విజయం సాధించిన విద్యార్థులను ,వారి తల్లిదండ్రులను విజయానికి కారణమైన ఉపాధ్యాయులను అభినందించారు .ఈ కార్యక్రమం లో కోఆర్డినేటర్ శివకుమార్ ,పాఠశాలల ప్రాంతీయ బాద్యులు సీతారామిరెడీ ,డీన్ వెంకటేశ్వరరావు ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.