NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ పై ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శంస‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రశంసలు కురిపించారు. గత రాత్రి కరీంనగర్‌లో నిర్వహించిన కళోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను సన్మానించారు. అనంతరం వారి ఆటపాటలను తిలకించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్రంపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా అందరి హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని అన్నారు. మతోన్మాదులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు.

                                   

About Author