NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతిభ కోచింగ్ సెంటర్ డీఎస్సీ విజయోత్సవ సభ

1 min read

విజయవాడ, న్యూస్​ నేడు:   ‌‌ప్రతిభ కోచింగ్ నిర్వహించిన “ఏపీ మెగా డిఎస్సీ 2025 విజయోత్సవ సభ” కానూరులోవిశేష విజయంగా జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక, కార్పొరేట్ ప్రముఖులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ప్రతిభ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జంపాన సుధాకర్  మాట్లాడుతూ. ఈ సారి జరిగిని ఏపీ మెగా డిఎస్సీ 2025 సెలక్షన్స్ లో ప్రతిభ కోచింగ్ సెంటర్ నుంచి 358 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు  మాట్లాడుతూ  చంద్రబాబు అంటే డిఎస్సీ, డిఎస్సీ అంటే చంద్రబాబు అని ప్రభుత్వ పోటీ పరీక్ష విధానాన్ని గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంల తెనాలి శ్రవణ్ కుమార్  ఎమ్మెల్యే తాడికొండ)మాట్లాడుతూ  నారా లోకేష్  ఇచ్చిన మాట ప్రకారం గా ప్రతి సంవత్సరం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవుతుంది అని తెలియజేశారు. బోడె ప్రసాద్ (ఎమ్మెల్యే, పెనమలూరు )బోడె ప్రసాద్  మాట్లాడుతూ డిఎస్సీ విద్యార్థుల కల నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గొట్టిముక్కల రఘు రామ రాజు  చైర్మన్ (APBOEW) స్వచ్ఛ్ ఆంధ్రా కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ. కొమ్మరెడ్డి పట్టాభిరాం .  మాజీ ఎంపీ మరియు APSRTC చైర్మన్  కొనకల్ల నారాయణరావు బోడే ప్రసాద్  ఎమ్మెల్యే , పెనమలూరు. గౌడ వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ వీరంకి వెంకట గురు మూర్తి   గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్     రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల ఈశ్వరరావు.    ఏస్ రామ రావు  (చైర్మన్, V G S Publications)  Ch. వెంకటేశ్వర రావు  (చైర్మన్ E – Zone Security Solutions Pvt Ltd)పేరేపి ఈశ్వర్ (చైర్మన్, శాలివాహన వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ Ch. A. మణి కుమార్  ఎండి తిరుచూర్,సభలో ప్రత్యేకంగా డిఎస్సీ డిఎస్సీ విజయార్థులకి సత్కారం చేయడంతో పాటు ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మార్గదర్శక సూచనల ద్వారా యువ ప్రతిభలకు ప్రేరణ నింపడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రగతి, విద్యాభివృద్ధి మరియు యువతకు అవకాశాల వెల్లివిరివేలా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

About Author