NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రహదారుల విస్తరణ పనులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం

1 min read

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం

ఇదేలక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని రహదారుల నిర్మాణానికి దశలవారీగా చర్యలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఇదే లక్ష్యంతో భవిష్యత్తులో మరిన్ని రహదారుల నిర్మాణానికి దశలవారీగా చర్యలు   చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బడేటి చంటి పరుగులు పెట్టిస్తున్నారు. దీనిలో భాగంగానే నిత్యం రద్దీగా ఉండే స్థానిక తంగెళ్ళమూడి నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్ళే రోడ్డుతో పాటూ, చింతలపూడి వైపు వెళ్ళే రోడ్డు విస్తరణా పనులు చివరిదశకు చేరుకున్నాయి. సోమవారం ఉదయం రోడ్డు విస్తరణా పనులను పరిశీలించిన ఆయన,,, అనంతరం ఆ ప్రాంతంలోని దుకాణ యజమానులతో స్వయంగా మాట్లాడారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలు పార్కింగ్‌ చేసేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన ప్రాంతాల్లో రోడ్డు విస్తరణా పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ఇదేక్రమంలో తంగెళ్ళమూడి రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్‌క్యాప్‌ నిధులు కోటి 10లక్షల రూపాయలు, కార్పొరేషన్‌ జనరల్‌ ఫండ్స్‌ 24లక్షల రూపాయలు మొత్తం కలిసి కోటి 34లక్షల రూపాయలతో ఈ రోడ్డు విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఎండ్‌ టూ ఎండ్‌ రోడ్డే లక్ష్యంగా అన్నిప్రాంతాల్లోనూ ఇదే విధానాన్ని అవలంభించనున్నామన్న ఆయన,,, తద్వారా వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని వెల్లడించారు. ఇదేక్రమంలో ఇక్కడి దుకాణ యజమానులు పార్కింగ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని  హెచ్చరించారు. ముఖ్యంగా లారీలను రోడ్డు పక్కన నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో లారీ యజమానులు కూడా సహకరించాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కో ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, చోడే వెంకటరత్నం ,డిప్యూటీ మేయర్ వందనాల శ్రీనివాస్‌, కార్పొరేటర్ దేవరకొండ శ్రీనివాస్, క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి నాగరాజు ,డివిజన్ ఇన్చార్జి నెరుసు గంగరాజు,  లంకలపల్లి ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకపల్లి తాతారావు, వేముల రంగమ్మ ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, మంచెం మైబాబు, బుగ్గల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

About Author