ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవం !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం ముమ్మరమైందన్నారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వెల్లడించారు. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.