NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీటి సమస్యపై ముందస్తు జాగ్రత్తలు అవసరం

1 min read

ప్రత్యేక అధికారి ఇమ్రాన్ భాష

చాగలమర్రి , న్యూస్​ నేడు: ప్రస్తుత వేసవికాలం పరిస్థితులకు అనుగుణంగా నీటి భద్రతా చర్యలు చేపట్టాలని మండల నీటి భద్రత ప్రత్యేక అధికారి ఇమ్రాన్ భాష అన్నారు. గురువారం జలదార కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ , వి బి జి రామ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ భాష మాట్లాడుతూ వేసవికాలంలో నీటి తాపం లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగం ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నీటి భద్రత జలధార కార్యక్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి చర్చించడమైనది. ఈ సమావేశానికి నూతన తహసిల్దార్ ఫణీంద్ర, డిప్యూటీ తాసిల్దార్ విజయకుమార్, ఏవో రాజేంద్రప్రసాద్, సచివాలయ సిబ్బంది, వి బి జి రామ్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *