NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నేళ్లు బేడ బుడగ జంగం రిజర్వేషన్ లేకుండా నష్టపోవాలి

1 min read

తూర్పాటి మనోహర్ రాష్ట్ర అధ్యక్షులు

విజయవాడ, న్యూస్​ నేడు:  విజయవాడ సెక్రటేరియట్ కార్యాలయం నందు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మల్లికార్జున నాయక్ ని,  EWS స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే సునీత మేడమ్ ని , ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ కలిసి వినతి పత్రాలు ఇస్తూ, 18 సంవత్సరాల నుంచి బేడ బుడగ జంగం కులమునకు రిజర్వేషన్ పరంగా న్యాయం జరగక, అన్యాయం జరుగుతూనే ఉన్నదని, ముఖ్యమంత్రివర్యులు మా జాతికి న్యాయం చేస్తామని తెలియజేస్తున్న, అది ఇంప్లిమెంట్ కావడం లేదని, సంబంధిత అధికారులకు తెలియజేసుకుంటూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది.  ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేక చొరవతోనే, కేంద్రంలో బేడ బుడగ జంగం రిజర్వేషన్ సమస్య పరిష్కారం కావలసి ఉన్నది. కనుక  ముఖ్యమంత్రి మా జాతికి ఇచ్చిన హామీ మేరకు న్యాయం చేయాలి.ఆంధ్రప్రదేశ్ లో  బేడ బుడగ జంగం కులము ఆన్లైన్ లో పొందపరచకపోవడం వల్లనే,మా జాతి వారికి చాలా నష్టం జరుగుతుందని, తక్షణమే మా కులం పేరు ఆన్లైన్లో నమోదు చేసి న్యాయం చేయాలని కోరడం జరిగినది.  వీటికి సంబంధించిన అధికారులు చీఫ్ సెక్రటరీ  దృష్టికి తీసుకువెళ్తామని, మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని తెలిపినారు.  ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం యూత్ నాయకులు సిరివాటి గిరిధర్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *