PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల నిర్వహణ కు సన్నద్ధం కావాలి

1 min read

ఇళ్ళ స్థలాల రిజిస్ట్రేషన్  9 వ తేదీ లోపు పూర్తి కావాలి

జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్నికల నిర్వహణ కు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్, ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్, కులగణన సర్వే తదితర అంశాల పై ఆర్ ఓ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓ లు,సంబంధిత  జిల్లా అధికారులతో  జిల్లా కలెక్టర్  సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాకు బదిలీపై వచ్చిన మండల స్థాయి అధికారులు ఎన్నికల నిర్వహణ కు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు.. ఎన్నికల నిర్వహణ లో తహశీల్దార్లు, ఎంపిడిఓలు ఇద్దరూ కీలకం అని, త్వరితగతిన వారి వారి మండలాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు..వచ్చే 10, 15 రోజుల్లో ఆయా మండలాల  పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ స్టేషన్ లను పరిశీలించాలని కలెక్టర్ తహశీల్దార్లు, ఎంపిడిఓ లను ఆదేశించారు..సెక్టార్ ఆఫీసర్ లు, బి ఎల్ వో లతో సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు..ఎన్నికలకు సంబంధించిన పనులతో పాటు  ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాల అమలుపై కూడా దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు . ఎన్నికల నిర్వహణ కు సంబంధించి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, పొరపాట్లకు తావు లేకుండా  ఎన్నికల విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.  ప్రతి  ఎలక్షన్ ను  కొత్త గానే భావించి, భారత ఎన్నికల సంఘం రూపొందించిన ఎన్నికల నియమావళి పై పూర్తి అవగాహన ఉండాలన్నారు..కింది స్థాయి సిబ్బంది మీద ఆధార పడకుండా  రిటర్నింగ్ అధికారి హ్యాండ్ బుక్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ,ఇతర నియమాలను తప్పనిసరిగా  చదవాలన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ఇంత వరకు ఏ పనులు జరిగాయి, ఇంకా ఏం చేయాలి అన్న అంశాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు.. ముఖ్యంగా పెండింగ్ ఫార్మ్స్ ఎన్ని ఉన్నాయి,  అందులో ఫార్మ్ 6, 8 లను పరిశీలించి  డిస్పోజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. అదే విధంగా  ఫార్మ్ 7 కి సంబంధించి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత  ఓట్లను తొలగించడానికి  కచ్చితంగా జిల్లా ఎన్నికల అధికారి అనుమతి ఉండాలన్నారు.. చనిపోయిన కేసులు అయితే  మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లా ఓటర్ల సంఖ్య తో పాటు, ఎక్కువ  దరఖాస్తులు (ఫార్మ్స్ ) రావడంలో కూడా ముందు ఉందన్నారు.. సెక్టర్ ఆఫీసర్లకు, బూత్ లెవెల్ అధికారులతో   సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలలో  మౌలిక సదుపాయాల గురించి వారితో చర్చించాలని సూచించారు.. సెక్టర్ అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళే రోడ్లు బస్సులు వెళ్లేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా, దారిలో అడ్డంగా కరెంట్ తీగలు ఉన్నాయా లేదా పరిశీలించి తమకు తెలియచేస్తే సరి చేసేందుకు  తగిన చర్యలు  తీసుకుంటామన్నారు.  అలాగే సెక్టార్ రూట్ మ్యాప్, స్ట్రాంగ్ రూమ్, డిస్పాచ్ సెంటర్ చేరడానికి ఎంత దూరం పడుతుంది, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏ నెట్వర్క్ పని చేస్తుందనే వివరాలను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు..    అలాగే   రాయలసీమ యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్,రిసెప్షన్ కేంద్రాలను  రిటర్నింగ్ అధికారులతో కలిసి తహసీల్దార్లు పరిశీలించాలన్నారు.. సెక్టార్  అధికారులు, బూత్ లెవెల్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.  కులగణన సర్వే లో మన జిల్లా 88 శాతంలో ఉందని, వాలంటీర్స్ ల ద్వారా రేపటి లోపు 90 శాతం పైగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంపిడిఓ లను ఆదేశించారు ..ఆరోగ్య శ్రీ కార్డ్ పంపిణీ చేయడంలో కర్నూలు జిల్లా పురోగతి చాలా బాగా సాధించారని,  అయితే ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేయించడంలో మాత్రం పురోగతి లేదని, రేపు సాయంత్రానికి ఈ అంశంపై  పురోగతి తీసుకొని రావాలన్నారు.. అలాగే ఆరోగ్య సురక్ష క్యాంప్ లకు సంబంధించి వాలంటీర్ లతో సర్వే ప్రక్రియ మొదలు పెట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓ లను కలెక్టర్ ఆదేశించారు.నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించిన ఇళ్ళ స్థలాల లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 9 వ తేది నాటికి  పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  సంబంధిత ఎంపిడిఓ లను, తహసీల్దార్ లను కలెక్టర్ ఆదేశించారు..సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని  కలెక్టర్ ఆదేశించారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ కు  సంబంధించి 93,811 మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని అందులో 77,097 మందికి ప్లాట్ నంబర్ ఉన్నందున బౌండరీలు మ్యాప్ చేసి 75,970 కి రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేయడం జరిగిందని, ఇంకా 1127 ప్లాట్స్ కు బౌండరీలు లేకుండా ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత తహశీల్దార్లను  ఆదేశించారు.. ప్లాట్ నంబర్లు లేని లబ్ధిదారులు 16,714 మంది ఉన్నారని అందులో 496 మ్యాప్ చేయవలసి ఉందని మిగిలిన  16,218 న్యాయస్థానంలో, అనర్హులుగా ఉన్నాయని వాటిని మ్యాప్ చేయలేమని అన్నారు… 321 సచివాలయాలలో 66,431 రిజిస్ట్రేషన్ డేటా పోర్ట్ అయ్యిందని, అందులో 276 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, 45 సచివాలయాలలో పెండింగ్ లో ఉందన్నారు..  ఏదైనా సచివాలయంలో నెట్వర్క్ సమస్యలు ఉన్నట్లయితే వేరే సచివాలయం కి వెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ మధుసూదన రావు, కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి, పత్తికొండ ఆర్డీఓ రామలక్ష్మి, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి,ఇతర నియోజకవర్గాల ఆర్వో లు,  జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

About Author