NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చట్టపరంగా ఏ సమస్యనైనా నివారించేందుకు సిద్ధం..

1 min read

ఆర్డిఓ కెఎస్ ఖాజావలి ….ఆర్డీవో ని కలిసిన బహుజనసేన నాయకులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  స్థానిక ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్. ఎస్.కె. ఖాజావలి (ఆర్డీవో) ని మర్యాదపూర్వకంగా కలిసిన బహుజనసే నాని, మత్తే బాబి మరియు బహుజన సేన నాయకులు. ఈ సందర్భంగా ఆర్డీవో ని కలిసి పుష్పగుచ్చం అందించి బహుజనులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆర్డిఓ ని కోరడం జరిగింది దానికి ఆర్. డి.ఓ సానుకూలంగా స్పందించి బహుజనులు పడే ఇబ్బందులు వారి  సమస్యల పట్ల ప్రజలు తనను నేరుగా కలవచ్చని చట్టపరంగా ఏ సమస్యలైన  సరైన రీతిలో విచారణ చేసి న్యాయం చేస్తానని అందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పిట్టా రాహుల్, సింగిరెడ్డి రామకృష్ణ,తియ్యాల శరత్, బహుజన సేన జిల్లా మహిళా నాయకురాలు గండికోట రాణి తదితరులు పాల్గొన్నారు.

About Author