పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం విశ్వ హిందూ పరిషత్, కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో….ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరిగిన మారణ కాండను వ్యతిరేకిస్తూ… కర్నూలు కలెక్టర్ కార్యాలయం మహాత్మా గాంధీ విగ్రహం ముందు జరిగిన “నిసనధర్నా” మరియు జిల్లా కలెక్టర్ ద్వారా గౌరవం రాష్ట్రపతి కి వినతి పత్రం అందించారు.ఈ నిరసన ధర్నాలో కర్నూలు జిల్లా అధ్యక్షులు టి.సీ.మద్దిలేటి మాట్లాడుతూ… వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించడం పేరుతో బెంగాల్ మొత్తం హింసాకాండలో కాలిపోతున్న తీరు, హిందువులను హింసిస్తున్న తీరు, జాతి వ్యతిరేక, హిందూ వ్యతిరేక శక్తులకు తమ కుట్రలను ఎటువంటి అడ్డంకులు లేకుండా అమలు చేయడానికి స్వేచ్ఛ ఇస్తున్న తీరు చూస్తే బెంగాల్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని స్పష్టమవుతోంది. ముర్షిదాబాద్‌లో ప్రారంభమైన ఈ భయంకరమైన హింస ఇప్పుడు బెంగాల్ అంతటా వ్యాపించింది.విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సభ్యులు మాట్లాడుతూ… 1. బెంగాల్‌లో భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం ద్వారా తన ప్రభుత్వాన్ని మరియు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి మమతా ప్రభుత్వం ఎంతవరకైనా వెళ్ళగలదు. 2. బెంగాల్‌లో జాతీయ భద్రత ప్రమాదంలో ఉంది. బంగ్లాదేశీ, రోహింగ్యా చొరబాటుదారులను స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. వారి ఆధార్ కార్డులు తయారు చేయబడుతున్నాయి. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నాయి3. హిందువులపై హింస పెరుగుతోంది మరియు కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే హిందూ పండుగలకు అనుమతి ఉంది.ఈ కార్యక్రమంలో… ప్రాంత కోశాధికారి సందడి మహేష్ జిల్లా కార్యదర్శి నాగరాజు బజరంగ్దళ్ సంయోజక్ సాయిరాం జిల్లా సామాజిక సమరసతా ప్రముఖ జంపాల నవీన్ జిల్లా బజరంగ్దళ్ కార్యకర్తలు భగీరథ హరికృష్ణ సురేష్ యశ్వంత్ సాయినాథ్ రాము, ప్రఖండ కార్యదర్శులు జిల్లా బజరంగ్దళ్ కార్యకర్తలు భాజపా నాయకులు చంద్రమౌళి ఆర్ఎస్ఎస్ సభ్యులు రామకృష్ణ రామాంజనేయులు, కుల సంఘాల ధార్మిక సంస్థల కార్యకర్తలు హాజరయ్యారు.