PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి –ఏపీ జేఏసీ

1 min read

– రాష్ట్ర జనరల్ సెక్రటరీ:హృదయ రాజు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మరియు 12వ పిఅర్సీలో మధ్యంతర భృతి 30 శాతం మంజూరు చేయాలని ఏపీ జేఏసి రాష్ట్ర సెక్రటరీ జనరల్ జి.హృదయ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏపీ జెఎసి ఉద్యమ కార్యచరణ పిలుపులో భాగంగా నిన్న రెండవ రోజున నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధ్యాహ్న భోజన సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు పిఎఫ్,ఏపీ జిఎల్ ఐ, సరెండర్ లీవ్,మెడికల్ రీయంబర్స్మెంట్ 11వ పిఆర్సి మరియు డిఏ బకాయిలు 25 వేల కోట్ల రూపాయల మేరకు పెండింగ్లో ఉన్నాయని తక్షణమే వాటిని చెల్లించాలని మరియు 12వ పిఆర్సి కమిషన్ వేసినప్పటికీ అమలు కానందున నిత్యా వసర ధరలు విపరీతంగా పెరిగిపోయిన కారణంగా వెంటనే 30% మధ్యంతర భృతి(ఐఆర్)ను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏపీ జేఏసీ కార్యాచరణ తాలూకా/జిల్లా కేంద్రాల్లో ధర్నాలు,ఫిబ్రవరి 27న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అంతే కాకుండా మా సమస్యలపై సానుకూలంగా స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లికార్జున నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author