సూర్యనారాయణ స్వామి వారికి ప్రముఖ న్యాయమూర్తి ప్రత్యేక పూజలు
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గౌరవనీయులైన శ్రీమతి మల్లీశ్వరి కర్నూలులోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించి, స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని, దేవాలయంలో నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు.స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆలయ అర్చకులు ప్రార్థించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దివ్య అనుగ్రహం వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.


