NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ న్యాయ సేవా దినోత్సవం పై వారోత్సవాలు”

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి,  జాతీయ న్యాయ సేవ దినోత్సవం నవంబర్ 9th సందర్భంగా నవంబర్ 2 నుంచి 9వ తారీఖు వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. లీగల్ సర్వీసెస్ వారి ఉచిత న్యాయ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. చట్ట పరమైన అయిన సమస్యలు ఏవైనా ఉంటే ప్రతి మండలంలో గల మండల లీగల్ సర్వీసెస్ గాని జిల్లా కేంద్రంలో  గల జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను గాని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. ఒకవేళ ఎవరికైనా చట్టపరమైన సమస్యలు ఉంటే వారు లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అలాగే స్కూల్స్ మరియు కాలేజి ల నందు జాతీయ న్యాయ సేవ దినోత్సవం పై వ్యాసరచన మరియు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి నవంబర్ 9న గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేస్తామని తెలిపారు.   ఈ సదస్సులో  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామ చంద్ర రావు , లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *