NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి

1 min read

రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనన్ ఛైర్మెన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి

మంత్రాలయం, న్యూస్​ నేడు:  ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని లేక పోతే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనన్ ఛైర్మెన్ చిత్త విజయ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వంట ఏజెన్సీ లో రికార్డుల్లో మిగులు 1500 గుడ్లు విద్యార్థులకు పంపిణీ చేయకుండా ఉన్నందుకు రికార్డులు సరిగా లేకపోవడంతో హెచ్ ఎం, స్కూల్ అసిస్టెంట్ కు సోకజ్ నోటీసులు ఇవ్వాలని డిప్యూటీ డిఇఓ వెంకట రమణ రెడ్డి ని ఆదేశించారు. సచివాలయం వద్ద ఉన్న అంగన్వాడీ 1 కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు సక్రమంగా లేకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తలతో పర్యవేక్షణ చేసి సరి చేయాల్సి ఉండగా లోపం వల్ల ఐసిడిఎస్ సూపర్ వైజర్ నాగలక్మి కి, అంగన్వాడీ కార్యకర్త తులసి పై ఆగ్రహం వ్యక్తం చేసి నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే అంగన్వాడీ 3 కేంద్రం ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్త విశాలాక్షి ని అభినందించారు. రచ్చమర్రి మోడల్ స్కూల్ లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్త లావణ్య, ఇక్కడ వంట చేస్తున్న లలీతమ్మ ఆయా ను వంట బాగా చేశావు అని అభినందించారు. మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తనిఖీలు చేశారు. వంట ఏజెన్సీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600 మంది విద్యార్థులకు 18 కేజీల కందిపప్పు వంట చేయాల్సి ఉండగా కేవలం 6 కేజీలు మాత్రమే వంట చేయడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని త్రీమెన్ కమిటీ కి ఆదేశాలు జారీచేశారు. బిసి సంక్షేమ హాస్టల్ ను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో హాస్టల్ లోనే ఉండాలని లేకపోతే చర్యలు తీసుకుంటామని వార్డెన్ గోపాల్ ను హెచ్చరించారు. రామచంద్ర నగర్ లో అంగన్వాడీ కేంద్రం 1, ను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్డు లో ఉంటే పిల్లలు ఇబ్బందులు పడుతారని ఎలా అని అడిగి తెలుసుకున్నారు. రాఘవేంద్ర పురం లో అంగన్వాడీ కేంద్రం 3 ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇక్కడ విద్యుత్ లేక పోవడంతో పిల్లలు ఎలా ఉంటారని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ ఏఈ తో మాట్లాడి మీటర్ వచ్చే వరకు తాత్కాలికంగా కరెంటు ఇవ్వాలని సూచించారు. చిలకలడోన లో రెండు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రేషన్ దుకాణం ను తనిఖీ చేసి డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యం వేసిన రషీద్ లు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని సక్రమంగా ఉండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాల లో హాస్టల్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల కు భోజనం వడ్డీంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచికరమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మంచి భోజనం వసతి బాగ ఉందని విద్యార్థులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. బాగా చదువుకుని మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ రవి, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజ రఘువీర్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్మల, సూపర్ వైజర్ నాగలక్మి, యం ఈఓ రాఘన్న, మొయినుద్దీన్, ఆర్ ఎస్, సిఎస్ డిటి మహేష్, సిఎస్ డిటి వలిబాష, ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వీఆర్వో ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *