ప్రజా పాలనకే.. పట్టాభిషేకం
1 min readమాజీ ఎంపీ బుట్టా రేణుక
పల్లెవెలుగు, కర్నూలు;
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను మెచ్చిన ప్రజలు మరోసారి ఆదరించి.. పట్టాభిషేకం చేశారని మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఆదివారం కర్నూలు కార్పొరేషన్, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు మున్సిపాలిటీ, గూడురు నగర పంచాయతీలో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ఒడి, పింఛన్, చేనేత, విద్యాకనుక తదితర పథకాల అమలులో తమ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్న మాజీ ఎంపీ బుట్టారేణుక… ప్రజలు జగనన్న పాలనను మెచ్చి… ఊహించని సంఖ్యలో తమ అభ్యర్థులను గెలిపించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.