పొడి తడి చెత్త గురించి ప్రజలకు అవగాహన సదస్సు
1 min read
అవగాహన సదస్సు నిర్వహించిన డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి
న్యూస్ నేడు హొళగుంద: మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్, అలాగే, డిపిఓ,ఆదేశాల మేరకు ఎంపీడీవో, విజయ లలిత ఆధ్వర్యంలో డిప్యూటీ,ఎంపీడీవో,చక్రవర్తి,శుక్రవారం, హొళగుంద, మరియు మార్ల మడికి, గ్రామంలో ఉపాధి కూలీలకు అలాగే ప్రజలకు తడి చెత్త పొడి చెత్త తయారు కేంద్రం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు,ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి,వారు మాట్లాడుతూ అది చెత్త మరియు పొడి చెత్త వేరు చేయడమనేది వ్యర్థాల నిర్వహణలో ఒక ముఖ్యమైన భాగం తడి చెత్త అంటే ఆహారం మరియు కూరగాయలు ఆకులు తొక్కులు, వ్యర్థాలు వంటి కుళ్ళి పోయే వ్యర్థాలు అలాగే పొడి చెత్త అంటే కాగితం గ్లాసులు ప్లాస్టిక్ మరియు లోహము, వంటివి అని తెలిపారు తడి చెత్త తో కంపోస్ట్ ఎరువు తయారు చేసి మొక్కలకు నర్సరీ పల్లె ప్రకృతి వనలకు, ఉపయోగించవచ్చని అన్నారు పొడి చెత్తను రిసైక్లింగ్, ప్రక్రియ ద్వారా ఉపయోగించవచ్చన్నారు, అలాగే, ఇవిఆర్ఎస్ కాల్స్ గురించి, తెలిపారు,ఇందులోభాగంగా,పంచాయతీ పనిచేసే కార్మికులు ప్రతిరోజు ఒక వార్డుకి చెత్తా సేకరించడానికి, చెత్త ఆటో అలాగే క్రాఫ్ట్ మిత్రులు రిక్షా, వస్తుందని, ప్రజలు, పొడి చెత్త తడి చెత్త అను, తమ ఇంటి దగ్గర ఉంచుకొని, పంచాయతీ ఆటో వచ్చినప్పుడు, ఆటోలో వేయాలని గ్రామ,పంచాయతీకి,సహకరించాలని కోరారు, పంచాయతీ కార్మికులు ఆ చెత్తాను, డంపింగ్ యార్డ్ కు తరలిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో, ఎంపీడీవో, విజయ లలిత, డిప్యూటీ ఎంపీడీవో, చక్రవర్తి, కార్యదర్శి, రాజ్ కుమార్, మార్ల మడికి రమేష్ పంచాయతీ సిబ్బంది, క్లాప్ మిత్రులు ప్రజలు కూలీలు పాల్గొన్నారు.