ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం
1 min read

విజయవాడ, న్యూస్ నేడు: డీఎస్సీలో 3% క్రీడాకారులకు ఉద్యోగాలను కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో పతకాలు సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం శాప్ చైర్మన్ అనిమినీ రవి నాయుడు ఆధ్వర్యంలో గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమిపాలనలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు డీఎస్సీలో 3% ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు.


