PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా తీర్పు.. బాధ్యత పెంచింది..

1 min read
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్​బాష

మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజాద్​బాష

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి అంజద్ బాష
పల్లెవెలుగు వెబ్​, కడప: సంక్షేమం.. అభివృద్ధికి.. పట్టం కట్టిన ప్రజలు.. గతంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వలేని ఘన విజయాన్ని వైసీపీ ప్రభుత్వానికి ఇచ్చారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి. అంజాద్ బాషా అన్నారు. అభివృద్ధి చేసినందుకే.. మరోసారి అందలం ఎక్కించారని సగర్వంగా పేర్కొన్న డిప్యూటీ సీఎం… ప్రజా తీర్పుతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. శనివారం బద్వేలు మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాష తో పాటు కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి,కడప మేయర్ సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో ని మొత్తం 11 కార్పొరేషన్ , 75 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పార్టీ 11 కార్పొరేషన్లలోను, 74 మున్సిపాలిటీలకు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిందన్నారు. అందులో బద్వేల్ మున్సిపాలిటీలోని 35 స్థానాలకు 30 స్థానాలు వైకాపాను గెలిపించి ఇంత పెద్ద విజయాన్ని అందించిన బద్వేల్ పురపాలక ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బద్వేల్​ను అభివృద్ధి చేస్తా…
అనంతరం బద్వేల్​ మున్సిపల్​ చైర్మన్​గా ప్రమాణ స్వీకారం చేసిన వాకమల్ల రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ .. రాబోవు రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తో పాటు బద్వేల్ పట్టణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీ ని తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతకుముందు కడప పార్లమెంట్ సభ్యులు వై. ఎస్ అవినాష్ రెడ్డి, కడప నగరపాలక సంస్థ మేయర్ సురేష్ బాబు ,ఎమ్మెల్సీ డి.సి గోవింద్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం బద్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డిని,బద్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏ. గోపాలస్వామిని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజద్ బాష, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి,కడప మేయర్ సురేష్ బాబులు కలసి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీసిపి నాయకులు సుధా, ఆదిత్య రెడ్డి, బద్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏ. గోపాలస్వామి,మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజేశ్వరి,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి,మెడికల్ హెల్త్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author