PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దానగుణాన్ని పెంపొందించేది రంజాన్ పండుగ

1 min read

– సహారా ముస్లిమ్స్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని సహారా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం పవిత్ర మాసం పండుగ సందర్భంగా 70 మందికి రంజాన్ తొఫాను పట్టణ పేద ముస్లింలకు అందజేశారు. 5 కేజీల సన్న బియ్యం, 30 గ్రాముల మోడీ టీ పొడి మరియు 500 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్ యస్.అబ్బాస్ హుస్సేన్ మాట్లాడుతూ “పవిత్ర రంజాన్ మాసం ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలని, రంజాన్ పండుగ అంటే దానధర్మాల పండగ అని, ప్రతి ఒక్కరూ దానగుణం అలవర్చుకొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో K.MD. ఖాజా హుస్సేన్, S.సమిఉద్దీన్, S. ఫైజుల్లా, S.హాజీవలి, S.మహబూబ్ బాషా, S.జిలాన్, మోడీ మార్కెటింగ్ ఆఫీసర్ S.అన్వర్, కలామ్ తదితరులు పాల్గొన్నారు.

About Author