NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విజువల్లి క్లీన్ విలేజ్ గా రామనపల్లె…

1 min read

చెన్నూరు, న్యూస్ నేడు: మండలంలోని రామనపల్లి గ్రామపంచాయతీని విజువల్లి క్లిన్ విలేజ్ ఎన్నుకున్నట్లు మండల అభివృద్ధి అధికారి. కిరణ్ మోహన్ రావు గురు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. 21వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు రామనపల్లి గ్రామపంచాయతీని మండలంలోని మొత్తం గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులు అందరి సహకారంతో గ్రామాన్ని పరిశుభ్రంగా చేయడం జరుగుతుందన్నారు. తదుపరిజిల్లా లింక్ అధికారి సరళ ఆదేశాల మేరకు  చెన్నూరు మండలంలోని రామనపల్లి గ్రామపంచాయతీ లో గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులు మొత్తం 42 మందికి  ఉదయం పది గంటల నుండి  థీమ్ 5 పై పరిశుభ్రత- హరిత గ్రామం మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. రామనపల్లి సచివాలయ సిబ్బంది  గ్రీన్ అంబాసిడర్లు గ్రీన్ గార్డులు అందరూ సహకరించి ఈ కార్యక్రమము జయప్రదం చేయవలసిందిగా ఆయన ఈ సందర్భంగా  కోరారు.

About Author