నూతన టీచర్లకు ఎస్ఆర్లు అందజేసిన ఏపీటీఎఫ్..
1 min read

ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : పేద విద్యార్థులకు విద్యాబోధన చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి హృదయ రాజు నూతన డీఎస్సీగా ఎన్నికైన 11 మంది ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థులను ప్రయోజకులుగా చేయాలన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో నూతనంగా ఎన్నికైన డీఎస్సీ ఉపాధ్యాయులకు హైస్కూల్ లో నూతన సర్వీస్ రిజిస్టర్ లను రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎంఈఓలు ఫైజు న్నిసా బేగం,మల్లికార్జున నాయక్ అందజేశారు.డీఎస్సీలో ప్రతిభ కనబరిచిన టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.పేద విద్యార్థులకు నాణ్యమైన బోధన చేసి వారి అభ్యున్నతికి పాటుపడే అవకాశం వచ్చిందని వినియోగించుకోవాలని అన్నారు.నూతన ఉపాధ్యాయులు తమ పాఠశాలలు ఎన్నుకొనుటకు ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయించడం మొదటి నెల జీతాలు మంజూరు చేయించుట కృషి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా నిబంధనల మేరకు సెలవుల మంజూరు కోసం ఇప్పటికే అధికారులకు ప్రాతినిధ్యం చేయడం జరిగిందని సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర అధ్యక్షుడు వారికి సూచించారు.మండలంలో ఉపాధ్యాయులకు సర్వీసు మేటర్ సమస్యలను పరిష్కారం చేస్తామని పాఠశాలలను బలోపేతం చేయాలని ఎంఈఓలు కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బి.సుంకన్న,మండల అధ్యక్షులు శేషయ్య,జిల్లా కౌన్సిలర్లు నాగార్జున,సురేష్ రాజ్,హెచ్ఎం సాయి తిమ్మయ్య పాల్గొన్నారు.


