రాముడి పేర మత చిచ్చు పెట్టడమంటే.. ఆయనకే అవమానం !
1 min read
పల్లెవెలుగువెబ్ : శ్రీరాముడి పేరిట మత చిచ్చు పెట్టడమంటే భగవంతుడు శ్రీరాముడు అనే మూల భావనకే అవమానకరమని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. శ్రీరామనవమి రోజు మతఘర్షణలకే వేదికైన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఆ శ్రీరాముడిని కూడా అసహనానికి గురిచేస్తాయని సామ్నాకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. దేశం రెండుగా చీలిపోతున్నా జనాల్లో మత విద్వేషాన్ని నింపి ఎన్నికల్లో గెలుపొందాలనే వ్యూహాన్ని బీజేపీ ఎంచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు మతఛాందస్సవాద చిచ్చుపెట్టడం, శాంతికి భంగం కలిగించడమంటే రెండోసారి దేశ విభజనకు బీజం వేస్తున్నట్టేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.