NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భార‌త్-పాక్ మ్యాచ్ పై రాందేవ్ బాబా సంచ‌ల‌న వ్యాఖ్యలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : భార‌త్ – పాక్ జ‌ట్ల మ‌ధ్య ఇవాళ జ‌ర‌గ‌నున్న టీ20 ప్రపంచ క‌ప్ మ్యాచ్ పై యోగా గురువు రాందేవ్ బాబా సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఒక ప‌క్క దేశంలో ఉగ్రక్రీడ పేట్రేగిపోతుంటే.. క్రికెట్ ఆడ‌ట‌మేంట‌ని ప్రశ్నించారు. క్రికెట్, ఉగ్ర క్రీడ ఒకేసారి ఆడ‌లేర‌ని అన్నారు. ఇలా చేయ‌డం దేశ ప్రయోజ‌నాల‌కు, రాజ‌ధ‌ర్మానికి విరుద్దమ‌ని అన్నారు. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్తత నెల‌కొన్నప్పుడు ఇలా చేయ‌డం స‌మంజ‌సం కాద‌న్నారు. భార‌త్ – పాక్ మ్యాచ్ పై దేశ వ్యాప్తంగా ప‌లువురు నిర‌స‌న వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కూడ స్పందించారు. భార‌త్ – పాక్ మ్యాచ్ పై అభ్యంత‌రం వ్యక్తం చేశారు. అయితే. మ్యాచ్ ను ఎట్టి ప‌రిస్థితుల్లోను ఆప‌లేమ‌ని బీసీసీఐ స్పష్టం చేసింది.

About Author