బిజెపి పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ గా రంజిత్ కర్ణి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్ గా రంజిత్ కర్ణి ని, కోకోన్వీనర్ గా గోవర్ధన్ ని నియమించడం జరిగింది. ఈ సందర్బంగా రంజిత్ కర్ణి మాట్లాడుతూ, తన పై నమ్మకం ఉంచి ఈ భాద్యతని అప్పగించినందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదములు తెలుపుతూ, పత్తికొండ నందు బిజెపి పార్టీని బలోపేతం చేసేవిందంగా కృషి చేస్తామని తెలియజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రభుత్వ వ్యతిరేక విదానాల పై ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రజల కొరకు పోరాడి బిజెపి జండా పత్తికొండ నియోజకవర్గంలో ఎగురవేసే విదంగా కృషి చేస్తామని తెలియజేశారు.