శరవేగంగా తమ్మిలేరు వద్ద బలివే వారాధి నిర్మాణం..
1 min readనిర్మాణానికి18.33 కోట్లు నిధులు మంజూరు
ఎమ్మెల్యే అబ్బాయా చౌదరి చొరవతో దశాబ్దాల కాలంనాటి కల నెరవేరబోతుంది
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : ఏలూరుపెదవేగి మండలం విజయరాయి వద్ద తమ్మిలేరు పై నిర్మిస్తున్న బలివే వారధి నిర్మాణం ఈ ప్రాంత ప్రజల శతాబ్దాల కల అబ్బయ్యచౌదరి పాలనలో నెరవేరింది? దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి ఈ వారధి నిర్మాణానికి సి ఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుండి 18.33 కోట్లు నిధులు మంజూరు చేయించి పెదవేగి మండలం లో చరిత్ర సృష్టించారు.ప్రజల గుండెల్లో మంచి రాజకీయ నాయకుడిగా అభివృద్ధి ప్రదాతగా పేరు ప్రఖ్యాతలు గడించారు.శతాబ్దాల కాలం నాటి నుండి జిల్లాల పునర్విభజనకు ముందు కూడా పెదవేగి మండలం విజయరాయినుండి కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివే లో జరిగే మహా శివ రాత్రి ఉత్సవాలకు వెళ్లాలన్నా పెదవేగి మండల ప్రజలు నిలువెత్తు లోతు నీరున్న తమ్మిలేరు ను దాటాల్సి వచ్చేది.వర్షాల సమయం లో వరదలు.ఉప్పెనల సమయాలలోవిజయరాయి.బలివే గ్రామాల మధ్య రాకపోకల బంధాలు తెగిపోయేయి. ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి చొరవతో బలివే పై వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టి పెదవేగి ముసునూరు మండలాల మధ్య రాకపోకలను పునరుద్ధరణకు వారధి నిర్మాణానికి పునాదులు వేశారు.దెందులూరునియోజక వర్గం లో బలివే వారధి నిర్మాణం తో పాటు ఏలూరు కైకలూరు రోడ్డులో శ్రీపర్రు దగ్గర కోట్లాది రూపాయల నిధులతో వంతెన నిర్మించిన ఘనత అబ్బయ్యచౌదరి కే దక్కుతుంది. ఏలూరు కొల్లేరు గ్రామాల కు వెళ్లే రహదారి దశాబ్దాలుగా అభివృద్ధికి దూర మైంది.లంక గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితి ప్రజల దయనీయ ప్రయాణం పై స్పందించిన ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి లంకల వెళ్లే రహదారుల ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి శాశ్వత పరిష్కారం చూపించి లంకల ప్రజల కష్టాలను తీర్చారు.అంతే కాదు ఏలూరునుండి చాటపర్రు మీదగా కొల్లేరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులను కోట్లాది రూపాయలతో నిర్మించి కొల్లేటి ప్రజల మనసులను దోచుకున్నారు. పెదవేగి మండలం లో 50 వేల గృహాలకు త్రాగు నీరు అందించడానికి 60 కోట్ల రూపాయలతో పెడవేగిలో త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించి అక్కడనుండి పైపు లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి త్రాగునీరందించే చర్యలు చేపట్టారు. దెందులూరు నియోజక వర్గ అభివృద్ధి అబ్బయ్యచౌదరి తోనే సాధ్యం అనే రీతిలో పాలన అందిస్తూ గ్రామాలలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ కుల మత కీయాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలతో అబ్బయ్యచౌదరి మమేకమోతున్నారు.