NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధులకు, విభిన్నప్రతిభావంతులకు.. ఇంటికే రేషన్ అందించాలి

1 min read

రేషన్ షాప్ డీలర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

సరుకుల విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు  1800 425 6453 కాల్ చేయాలి

ఏలూరు నగరంలో పలుచోట్ల రేషన్ పంపిణీనిఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఏలూరు జిల్లాప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు నగరంలో పలు ప్రదేశాలలో వృద్దులు, విభిన్నప్రతిభావంతులకు ఇళ్ళకి వెళ్లి రేషన్ పంపిణీని మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏలూరు నగరంలోని 23 వ డివిజన్ ఫిరంగులదిబ్బ లో 83 సంవత్సరాల కె. నాగమ్మ, 80 సంవత్సరాల  ఏ . సుబ్బలక్ష్మి, 66 సంవత్సరాల ఆర్. మహాలక్ష్మి ఇళ్ల వద్ద రేషన్ షాపు డీలర్ రేషన్ పంపిణీ చేస్తుండగా కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేసి, రేషన్ ను కలెక్టర్ స్వయంగా లబ్దిదారులకు అందించారు. రేషన్ పంపిణీ పట్ల వారి సంతృప్తిని అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తున్నారా లేదా అనే విషయాన్నీ పరిశీలించి, లబ్దిదారులను కూడా అడిగి తెలుసుకున్నారు. రేషన్ పంపిణీ విధానం పట్ల వారు సంతృప్తిని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  65 సంవత్సరాలు పైబడిన వృద్దులు,  విభిన్న ప్రతిభావంతులు,, మంచానికి పరిమితమైన వారికి  బియ్యం, పంచదార వంటి రేషన్ సరుకులను కార్డుదారులు ఇంటివద్దకే రేషన్ షాపు సిబ్బంది వచ్చి అందిస్తారు కలెక్టర్ చెప్పారు.  ప్రతీ రేషన్ షాప్ పరిధిలో 65 సంవత్సరాలపైన వయస్సు కలిగిన వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, మంచానికి పరిమితమైన వారి వివరాలు సంబంధిత రేషన్ షాప్ డీలర్ల వద్ద ఉన్నాయని, వారందరికీ వారి ఇంటివద్దే రేషన్ సరుకులు అందిస్తారన్నారు. రేషన్ సరుకుల పంపిణీలో ఎలాంటి సమస్య ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ 18004256453 నెంబర్ కు కాల్ చేయాలనీ కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, తహసీల్దార్ శేషగిరిరావు, స్థానిక ప్రముఖులు రామకృష్ణ, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *