రాయపాటి శ్రీనివాస్ కు ’సౌత్ అమెరికా’ అవార్డు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: సౌత్ అమెరికా దేశానికి చెందిన వెనిజులా అంతర్జాతీయ సంస్థ వరల్డ్ లిటరరీ ఫోరం ఫర్ పీస్ అండ్ హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ సంస్థ నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి, నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు ఆ సంస్థ అంతర్జాతీయ అధ్యక్షులు హెచ్ .ఈ డ్యూక్ డాక్టర్ సంతోష్ కుమార్ బిశ్వ నేడు అంతర్జాలంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి సమావేశంలో గత 36 సంవత్సరాలుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అంతర్జాతీయ స్థాయి ప్లాటినం మెడల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎక్సలెన్సీ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. ముఖ్యంగా ఆధార్ లేని అనాధలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చేయడం, ఇంటింటి సర్వే ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన పేద చిన్నారులను గుర్తించి వైద్య సేవలను అందించడం, నిరుపేద పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, బీరువాలు, సానిటరీ నాప్ కిన్స్ ,నోట్ బుక్స్ ,టూత్ పేస్టులు ,టూత్ బ్రష్ లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

