NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఐదేళ్లలో … 20 లక్షల ఉద్యోగాలు..

1 min read

  సింగపూర్ పర్యటనతో సత్ఫలితాలు..

  •  ఏపీ పై  ఉన్న వ్యతిరేకత తొలిగిపోయింది
  • పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్

 కర్నూలు, న్యూస్​ నేడు :  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు పరిశ్రమల శాఖ మంత్రి గా తాము జరిపిన సింగపూర్ పర్యటన సత్ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్  మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆదివారం ఉదయం స్థానిక మౌర్య హోటల్ ఫంక్షన్ హాల్ లో మంత్రి టి.జి.భరత్ మీడియా సమావేశంలో మాట్లాడారు.   ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సింగపూర్ పర్యటన విజయవంతమైనదని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ప్రస్తుత అధ్యక్షులు మరియు గత అధ్యక్షులతో పాటు అక్కడ వ్యాపారస్తులతో, బిజినెస్ మ్యాగ్నెట్లతో  సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కు  పెట్టుబడులు తీసుకు రావడానికి ప్రయత్నం చేశామని తెలిపారు.

ఏపీపై వ్యతిరేకత తొలగిపోయింది…

2019 సంవత్సరం తర్వాత ఏర్పడిన ప్రభుత్వం వలన  ఏపీ పై సింగపూర్ కు వ్యతిరేక భావం వచ్చినదని ..ఆ వ్యతిరేకతను పోగొట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బృందం మూడుసార్లు బిజినెస్ మాగ్నెట్లతో, పెట్టుబడిదారులతో  రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని.. ఈ సమావేశాల ద్వారా ఆంధ్రప్రదేశ్ పై ఉన్న వ్యతిరేక దృష్టిని తొలగించగలిగామని తత్ఫలితంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు మంచి సత్ఫలితాలు పెట్టుబడుల రూపంలో వస్తాయని తెలియజేశారు.   సింగపూర్ దేశ పర్యటనలో పలు ప్లాంట్ లు, పోర్టులు మరియు ఇతర ప్రదేశాలు సందర్శించడం జరిగిందని తెలుపుతూ అక్కడ దాదాపు అన్ని పరిశ్రమలలో షోకేస్ లో బొమ్మలు ఉన్న విధంగా ఉండటం చూసామని అవి అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ద్వారా పనులు జరుగుతూ ఉంటాయని తెలిపారు.

ఓర్వకల్లులో.. రిలయన్స్​ పెట్టుబడులు..

ఇక ఓర్వకల్లులో రిలయన్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టుతున్నదని తెలిపారు. పైలట్ ట్రైనింగ్ కోర్సులు చేసిన వారికి మంచి జీతాలతో ఉద్యోగాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే కోయంబత్తూర్ కంపెనీ ఓర్వకల్లుకు వచ్చిందని ఇప్పుడు బాంబే కంపెనీ కూడా వస్తున్నదని కావున పైలట్ కోర్సులు నేర్చుకోవాలని మంత్రి తెలిపారు. ముచ్చుమరి నుండి ఓర్వకల్లు హబ్ కు నీటిని తీసుకొచ్చే పనులు 90% పైగా పూర్తయ్యాయని.. పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి పారిశ్రామిక అభివృద్ధికి క్కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వలన ఓర్వకల్లు లో ఉన్న ఎయిర్పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మీడియా ప్రశ్నలకు … మంత్రి సమాధానం…

 త్వరలో దేశంలోనే అత్యున్నత సౌకర్యాలు మరియు ఇన్సెంటివ్ ల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్నదని. దశాబ్దాల నుండి చర్చకు ఉన్న టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు త్వరలో పూర్తి అయిపోతుందని తెలియజేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉన్న వలసలు ఆపటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. మూతపడుతున్న చిన్న తరహా పరిశ్రమలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి వాటిని నిలదొక్కుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తద్వారా వలసలు ఆపే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. రాష్ట్రంలోని టిడ్కో గృహాలను త్వరలో   నివాసయోగ్యంగా మార్చి ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక హైకోర్టు బెంచ్ కర్నూలుకు వచ్చే ప్రక్రియ వేగంగా సాగుతోందని చెప్పారు.  గత ప్రభుత్వ పాలకులు లిక్కర్ స్కామ్ లో పాలుపంచుకోవడం వలన రాష్ట్రానికి తీవ్రంగా ఆర్థిక నష్టం జరిగిందని వారిపై చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. వారు ఇమెయిల్ ద్వారా సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ గురించి చెడుగా ప్రచారం చేశారని, ముఖ్యమంత్రి వయసు మీరిపోయారని మరియు మహిళా ప్రజాప్రతినిధులను నీచంగా విమర్శించే చర్యలు చేస్తున్నారని.. భవిష్యత్తులో వారికి ఇప్పుడు ఉన్న 11 స్థానాలు కూడా ఉండవని తెలియజేశారు.

About Author