NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాల భవనం

1 min read

ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం మరియు ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాల నూతన భవనం

ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ సి. హెచ్. నాగ కిరణ్ కుమార్. 

కర్నూలు, న్యూస్​ నేడు:  ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం మరియు ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాల ప్రారంభోత్సవానికి  సిద్ధంగా ఉన్నాయని ఔషధ నియంత్రణ డిప్యూటీ డైరెక్టర్ సి. హెచ్. నాగ కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు..ప్రాంతీయ ఔషధ పరీక్ష ప్రయోగశాలలో ప్రతిపాదిత వార్షిక ఔషధ పరీక్ష సామర్థ్యం 1500 నమూనాలు అన్నారు.. ప్రయోగశాల ప్రారంభం మరియు నిర్వహణతో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు తీసుకున్న ఔషధ నమూనాల నాణ్యతను నిర్ణయించడానికి విశ్లేషణ తగ్గించబడుతుందని మరియు మార్కెట్‌లో నకిలీ మరియు నాసిరకం ఔషధాలను సకాలంలో గుర్తించడానికి రిపోర్టింగ్ సమయం కూడా తగ్గుతుందన్నారు.. ప్రాంతీయ డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, కర్నూలు కార్యాలయానికి రూ. 99.18 లక్షలు అంచనా మొత్తం అన్నారు.. కర్నూలులోని ప్రాంతీయ ఔషధ నియంత్రణ ప్రయోగశాల కార్యాలయం కొరకు రూ.179 లక్షలు అన్నారు.  కర్నూలులోని ఆర్‌హెచ్. &ఎఫ్‌డబ్ల్యుటిసి.(ఎం) క్యాంపస్‌లో  15.53 సెంట్లలో  విస్తీర్ణంలో ఉందన్నారు..  ఈ యొక్క భవన నిర్మాణం పని 25-05-2020 వ తేదీన ప్రారంభించి 09-07-2025 వ తేదీన 100 శాతం  పని పూర్తి అయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు.

About Author