నూతన సిమెంట్ రోడ్డు కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి
1 min read

ఆదోని , న్యూస్ నేడు: ఆదోని పట్టణంలోని ఏడవ వార్డు కొనిముల్ల ఏరియాలో సీసీ రోడ్డు నిర్మాణమునకు ఎనిమిది లక్షల తోపాటు రెండు లక్షలతో డ్రైనేజీ పనులకు శనివారం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదోని ప్రజలకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం డైరెక్టుగా మున్సిపాలిటీలో జమ చేసే 15వ ఆర్థిక సంఘం నిధులు ఐదు కోట్ల 80 లక్షలు ఆదోని మునిసిపాలిటీకి విడుదల అయ్యాయని దీని ద్వారా పట్టణంలోని సమస్యలను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడిందని అన్నారు, ఈ గ్రాంట్ ను రెండు రకాలుగా విభజించి టైడ్ గ్రాంట్ కింద మూడు కోట్ల 48 లక్షల రూపాయలను త్రాగునీటి వసతి (ఇంటింటి కొళాయి) కోసం ఖర్చు చేయడం జరుగుతుందని, అలాగే రెండు కోట్ల 32 లక్షల రూపాయలను రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ కోసం ఖర్చు చేయడం జరుగుతుంది కాబట్టి రాబోయే మూడు నెలల్లో ఆదోనిలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతాయని ఇది శుభసూచకం అని తెలియజేశారు. కార్యక్రమం లో మునిసిపాల్ చైర్మన్ లోకేశ్వరి ,వైస్ చైర్మన్ గౌస్,నరసింహాలు మునిసిపాల్ ఇంజినీర్ సత్య నారాయణ,కౌన్సిలర్లు,టీడీపీ,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

