ఈ- క్రాఫ్ పంట నమోదు తప్పనిసరి..
1 min readజిల్లా వ్యవసాయ సలహామండలి అధ్యక్షులు,సంబటూరు ప్రసాద్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు : మండలంలోని రైతులందరూ ఈ- క్రాఫ్ పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని, రైతులకు దీని ద్వారా మరింత లాభదాయకంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు సంబ టూరు ప్రసాద్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని ఉప్పరపల్లి, చిన్న మాచుపల్లి గ్రామ పొలాలలో రైతులతో మాట్లాడడం జరిగింది, ఆయన మాట్లాడుతూ రైతులు తమకు సంబంధించిన పొలంలో ఏయే పంటలు వేసుకున్నారో ఆ పంటలకు సంబంధించి, రైతు భరోసా కేంద్రాల్లో పంట నమోదు చేయించుకోవాలని సూచించారు, అదేవిధంగా ఎవరైనా రైతులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోకుండా ఉంటే వారు తప్పకుండా ఈ కేవైసీ చేయించుకోవాలని తెలిపారు, దీని ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, పంట నష్ట పరిహారం అందుతుందని ఆయన తెలియజేశారు, అలాగే మండల వ్యవసాయ సిబ్బందితో మాట్లాడుతూ,ఉప్పరపల్లి గ్రామపంచాయతీలో ఈ క్రాప్ డేటా ప్రస్తుతం పొలంలో ఉన్న పంటకు ఆన్లైన్లో నమోదు, వంటివి ఎంతవరకు చేయడం జరిగింద ని చూసుకొని , తదుపరి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే త్వరగ తిన ఈ క్రాప్ సర్వే నెంబర్ వారీగా నమోదు చేసి పంటలకు సంబంధించినవి సరి చూసుకొని వెరిఫై చేసుకోవాలని ఆయన వారికి సూచించారు, అలాగే రైతులు రబీలో పంట సాగు చేయడానికి కావలసిన వరి విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ఈ కార్యక్రమంలో డి ఏ ఓ ఐతే నాగేశ్వరరావు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఎర్ర సాని మోహన్ రెడ్డి, ఎంపీటీసీలు, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, ముది రెడ్డి సుబ్బారెడ్డి, గ్రామ సర్వేయర్ ,విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విఆర్ఓలు అధికారులు, రైతులు పాల్గొనడం జరిగినది.