PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేరు మార్చుకున్న తెలుగు హీరో !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ తెలుగు నటుడు అదిత్ అరుణ్​ పేరు మార్చుకున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘డియర్ మేఘ’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ వంటి చిత్రాలతో నటుడిగా, హీరోగా తన మార్క్‌ను ప్రదర్శిస్తున్న అదిత్ అరుణ్.. సడెన్‌గా తన పేరును త్రిగుణ్‌గా మార్చుకుంటున్నట్లుగా ప్రకటించాడు. తన రీసెంట్ ట్వీట్‌లో ‘ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్..’ అంటూ అనౌన్స్ చేశారు. ఇకపై తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్‌గా పిలవాలని ఈ యంగ్ హీరో కోరారు. కాగా, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘కొండా’ చిత్రంలో నటిస్తున్న త్రిగుణ్.. ఈ సినిమా తన కెరీర్‌లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు.

       

About Author