గణతంత్ర భారతావనికి సమున్నత కీర్తి పెంపొందాలి
1 min read– రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలి
– నందికొట్కూరు లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గణతంత్ర భారతావనికి సమున్నత కీర్తి పెంపొందాలని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని మున్సిపాలిటీ, మండల పరిషత్ కార్యాలయం,తహశీల్దార్ కార్యాలయం, వ్యవసాయ శాఖ, స్థానిక సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు చేసిన సేవలు స్మరించుకున్నారు. నందికొట్కూరు మున్సిపాలిటీ లో చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కమిషనర్ పి.కిషోర్, తహశీల్దార్ కార్యాలయం లో తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శోభారాణి, ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ విజయ శేఖర్, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్ చంద్రమౌళి, సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో అర్బన్ సీఐ విజయభాస్కర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. సంధర్బంగా వారు మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం , స్వాతంత్ర్య భారతం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందన్నారు.భిన్న మతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారిన భారత దేశ ప్రతిష్ఠతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్య సమర యోధులను స్మరించుకుంటూ, వారి ఆశయాలను , లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ మరింత బాద్యతగా పనిచేయాలన్నారు. భారత దేశాన్ని అగ్రగామి రాజ్యంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ,వాలంటరీ వ్యవస్థలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా బ్రిటీష్ వారి పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిందని, ఆ మహానుభావులను ప్రతీ ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగవ్యవస్థగా రూపొందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అర్షపోగు ప్రశాంతి, కౌన్సిలర్లు రాధిక, శాంతి కుమారి, మందాడి వాణి, విజయమ్మ , రూపదేవి, దేశెట్టి సుమలత, చాంద్ బాష, రావూఫ్, అబ్దుల్ హమీద్, బోయ జయమ్మ, మండల వ్యవసాయ అధికారి శ్రావణి, డిప్యూటీ తహసీల్దార్ పద్మావతి, సత్యనారాయణ, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.