ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి కి వినతి
1 min read
డిసి కంట్రోల్ పాయింట్ల మరమ్మత్తుల మరియు తగిన సిబ్బంది కోసం వినతి
హొళగుంద, న్యూస్ నేడు : హొళగుంద మండలం మండలంలోతుంగభద్ర ప్రాజెక్టు దిగువ కాలువ, ఆదోని రెవిన్యూ డివిజన్ పరిధిలో డిసి, 1,కు సంబంధించి హొళగుంద మరియు హాలహర్వి, మండలాలలో ఆయకట్టు చివరి రైతు లకు,సాగునీరు అందించేందుకు తమరికి విన్న ఇస్తున్నాను డిసి, 1, పరిధిలోని డిపి 37 (చింతకుంట) డిపి 44- 57 మరియు డిపి 44-57 మరియు డిపి,60-73h వరకు చిన్న కాలువలకు గత 15 సంవత్సరాలుకు పైగా మరమ్మతులు జరగలేదు సరైన నిర్వహణ లేకపోవడంతో చిన్న కాలువలు అస్తవ్యస్తంగా మారిపోయాయి కాలువ గట్టు కొన్నిచోట్ల పగిలిపోయి మరియు రంద్రాలు పడి నీరు వృధాగా పోతుంది మరియు అడ్డదిడ్డంగా ముల్ల కంపలు పెరిగిపోయి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడింది చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు సరిగా అందకపోవడంతో పంటలు సరిగా చేతికి అందక దిగుబడులు తగ్గి ఆయకట్టు రైతులు నష్టపోతూ ఇబ్బందులు పడుతున్నారు అంతేకాక ఆయకట్టు కాలువపై రోడ్లు కూడా ఎంతో అవసరం ఉంది ఆయకట్టు కాలువపై,రోడ్డు సరిగ్గా లేకపోవడంతో కాలువ చివరి వరకు పర్యవేక్షణ చేయడం సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది అంతేకాకుండా డి సి,1, పరిధిలో,22, చిన్న కాలువలు( డిపి) ఉన్నాయి ప్రతి చిన్న కాలువకి ఒక లస్కర్ ఉండాల్సి ఉండగా మొత్తం మీద నలుగురు మాత్రమే లస్కర్లు ఉన్నారు దీంతో కొందరు ఆయకట్టు రైతులు నీటిని పొందలేక నీటి కోసం వంతులు, వారిగా కష్టపడుతున్నారు మీరు అందకపోవడంతో పంటలు రక్షించుకోవడానికి గొడవలు పడుతున్నారు కాబట్టి మంత్రివర్యులు ఆయకట్టు రైతులు కష్టాలను గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చుకోవడం కోసం తుంగభద్ర ప్రాజెక్ట్ దిగువ కాలువపై అవసరమైన 18 లస్కర్లను నియమించాలని డిసి, 1- పరిధిలోని చిన్న కాలువలు మరియు డిపి కంట్రోల్ పాయింట్లు మరమ్మత్తు పనులను ఈ వేసవి కాలంలో చేపట్టాలని అధికారులను ఆదేశించి అవసరమైన నిధులను మంజూరు చేయగలరని విన్నవిస్తున్నాను దిగువ కాలువలకు నీటిని ఈ నెల 24వ తేదీ వరకు నిలుపుదల చేస్తారని అధికారులు ఉంటున్న పరిస్థితిలో మా యొక్క డిపి 1- పరిధిలో వరి పంట చివరి దశలో ఉందని తమకి తెలుపుకుంటూ రైతులు నష్టపోకుండా మన యొక్క నీటి వాటా లభ్యత మేరకు రైతులు పంట నష్టపోకుండా ఈనెల చివరి వరకు ఆయకట్టు కు నీటిని అందించాలని విన్నవిస్తున్నాను.