NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందన కార్యక్రమం పై మండల అధికారులతో సమీక్ష

1 min read

– జగనన్నకు చెప్పుదాం.. స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

-మండల స్పెషల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటసుబ్బయ్య

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  నేడు స్థానిక రెవిన్యూ కార్యాలయంలో కలెక్టర్ విజయరామరాజు అధ్యక్షతన జరుగు జగనన్నకు చెబుదాం.. స్పందన కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి సిహెచ్ వెంకటసుబ్బయ్య కోరారు, మంగళవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం పై మండల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ బుధవారం ఉదయం 9:30 గంటల నుండి నుండి మధ్యాహ్నం వరకు జరగబోయే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయరామరాజుతోపాటు 18 మంది జిల్లా ముఖ్య అధికారులు పాల్గొంటారని తెలియజేశారు, స్థానిక రెవిన్యూ కార్యాలయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆయన మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు, మండలంలోని 9 గ్రామ సచివాలయాలకు సంబంధించిన సిబ్బంది తో పాటు ఆయా గ్రామ సచివాలయాలలో ఇద్దరు జిల్లా అధికారులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు, గతంలో స్పందనలో వచ్చిన అర్జీలపై ఆరా తీయడం జరుగుతుందని, ఎన్ని అర్జీలు వచ్చాయి, ఎన్ని పరిష్కరించబడ్డాయి, ఎన్ని పరిష్కరించబడలేదు, అవి ఎందుకు పరిష్కారం కాలేదు వంటి విషయాలను వారు అడగడం తో పాటు, అన్ని విషయాలపై వారు పరిశీలించడం జరుగుతుందన్నారు, ఆయా సచివాలయాలకు సంబంధించి అక్కడి సిబ్బంది స్పందనలో ఎన్ని అర్జీలు వచ్చింది రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు, నేడు జరగబోయే స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీడీవో గంగిడిపల్లి సురేష్ బాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

About Author