బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత దేశం నుంచి బాస్మతియేతర బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయి. 2021-22 సంవత్సరంలో 611.5 కోట్ల డాలర్ల విలువైన (ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో సుమారు రూ.46,400 కోట్లు) బాస్మతియేతర బియ్యం ఎగుమతి అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. 2013-14 సంవత్సర ఎగుమతుల (292.5 కోట్ల డాలర్లు)తో పోల్చితే 109 శాతం వృద్ధి నమోదైనట్టు పేర్కొంది. అత్యధికంగా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతయ్యాయని.. నేపాల్, బంగ్లాదేశ్, చైనా, మలేషియా, మడగాస్కర్, లైబీరియా, యూఏఈ తదితర దేశాలకు బియ్యం ఎగుమతి జరిగినట్టు తెలిపింది.