PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హైదరాబాద్ ఔటర్‌పై 8 కార్లు ఢీ.. ధ్వంసమైన వాహనాలు

1 min read


పల్లెవెలుగు వెబ్: హైదరాబాద్ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద అంబర్ పేట వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై 8 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ముందుగా పెట్రోల్ బంక్ నుంచి ఓ లారీ ఆకస్మాతుగా రోడ్డుపై రావడంతో వేగంగా వెళుతున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో కారు వెనక నుంచి వస్తున్న మిగతా కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇలా మొత్తంగా 8 కార్లు ఢీకొన్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కార్లు మాత్రం ధ్వంసమయ్యాయి.

About Author