PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రోడ్డు భద్రతా సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలి

1 min read

– రోడ్ సేఫ్టీ వారోత్సవాల పై యన్. జి. ఓ. ల పాత్ర అభినందనీయం
– ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు సందర్భంగా స్థానిక విన్ అవర్ నెటీస్, సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ, రోడ్డు సేఫ్టీ యన్ జి. ఓ, తరుపున ఏలూరు జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు, విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కోసమే తరువాత చేసిన ప్రచార సామాగ్రి ని వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తమ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టేక్ హోల్డర్సే కాకుండా యన్ జి ఓ లు కూడా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రచారం చేయాలి అని పేర్కొంటూ, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మద్యం సేవించి వాహనాలు నడపటం మూలం గానే జరుతున్నాయని తెలిపారు. మన జిల్లాలో పెరికె వరప్రసాద్ స్వచ్ఛందoగా రోడ్డు భద్రతా వారోత్సవాలప్రచార సామగ్రిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంవత్సరం “స్వచ్చత పక్వడా” అనే నినాదాలతో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రోడ్డు సేఫ్టీ యన్ .జి. ఓ ప్రాంతీయ అధ్యక్షులు మారియూ ప్రెసిడెంట్ సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ పెరికె వరప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఒక సంవత్సరకాలం లో ఒక లక్ష యాబై వేల మంది చనిపోతున్నారు, దీనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్ ద్వారానే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఒక నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కమిటీని కూడ నియమించిందని, వారి ఆదేశాలు మేరకే మన జిల్లాలో జిల్లా కలెక్టర్ మరియు చైర్మన్ గా జిల్లా రహదారి భద్రతా కమిటీ ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు, ఈ కమిటీ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ ఎడ్యుకేషన్,ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ పై దృష్టి పెట్టాలి అని సుప్రీంకోర్టు కమిటీ నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు అని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రోడ్డు ప్రమాదాల రహిత రాష్ట్రoగా ఉండటానికి విస్తృతంగా ప్రచారంలో భాగంగానే యన్. జి. ఓ లని భాగస్వామ్యం చేయడం జరుగుతుందిఅని తెలిపారు, రోడ్డు భద్రతా నియమాలు పాటిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విన్ అవర్ నేటిస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పి జీవన్ కుమార్ పాల్గొని. ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని. వారి కుటుంబాలను సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచిస్తూ రోడ్ సేఫ్టీ భద్రతా వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

About Author